![]() |
![]() |

బిగ్ బాస్ ఆరో సీజన్ లో పాల్గొన్న నేహా చౌదరి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకుంది. టీవీ యాంకర్ గా చేసిన తను.. బిగ్ బాస్ కి రావడంతో ప్రపంచమంతా సుపరిచితమైంది.
ఇక ఇప్పుడు నేహా చౌదరి పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. తన చిన్ననాటి క్లాస్ మేట్ నే పెళ్లి చేసుకోబోతోంది. అతని పేరు అనిల్. వారిద్దరికి చిన్నతనం నుండి ఒకరంటే ఒకరికి ఇష్టమని చెప్పుకొచ్చింది నేహా. అయితే నిన్న తనని పెళ్ళికూతురిని చేసారు. అలా రెడీ చేసాక "I'm that Hyper Excited bride!!!" అని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా పెట్టింది. తన మ్యారేజ్ కి సంబందించిన పనులు ఎలా జరుగుతున్నాయో ప్రతీది, ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది.
ఈరోజు(ఆదివారం) జరగనున్న నేహా పెళ్ళికి బిగ్ బాస్ నుండి వెళ్ళిపోయిన వాళ్ళందరూ వస్తున్నట్టు ఒక వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే తన ఎంగేజ్మెంట్ కి సూర్య, సుదీప, చంటి, రాజ్, గీతు, ఫైమా ఇంకా తదితరులు వచ్చారు. దీంతో పెళ్ళికి అందరూ హాజరు అవుతారని తెలుస్తోంది. అయితే తన ఎంగేజ్మెంట్ జరిగాక ఎక్కడా కూడా అనిల్ ఫోటోని రివీల్ చేయలేదు. దీంతో తన ఫాలోవర్స్ అంతా "Where is Pellikoduku..why this much suspense" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే పెళ్ళికొడుకుని డైరెక్ట్ గా పెళ్ళి పీటల మీదే అందరికీ చూపించాలని నేహా అనుకుంటున్నట్టుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
![]() |
![]() |